న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో నానికి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.నెటిజెన్లు కూడా ఈ టీజర్ లోని డైలాగ్స్ తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు.
మెగాస్టార్ “విశ్వంభర” స్టోరీ లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!
ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే నాని ఫేస్ వీడియో లో సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీ చూపించడానికి కారణం ఏమై ఉంటుందనే దాని మీద ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ గెటప్ గురించి ఆసక్తికర విషయం తెలియజేసాడు..
ఈ రెండు జడలకు తన బాల్యానికి కనెక్షన్ ఉందని, చిన్నప్పుడు అయిదేళ్ల వయసు దాకా తన తల్లి తనను అలాగే పెంచిందని, ఆ స్ఫూర్తితోనే ప్యారడైజ్ లోని నాని పాత్రను డిజైన్ చేశానని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇంత కన్నా డీటెయిల్స్ చెప్పలేనని, షూటింగ్ మొదలయ్యాక సందర్భాన్ని బట్టి పంచుకుంటానని శ్రీకాంత్ తెలిపారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది…