మెగాస్టార్ చిరంజీవి నుండి గత ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు.. గతంలో మెగాస్టార్ నటించినా భోళా శంకర్’ ఆయన చివరి సినిమా..మెహర్ రమేష్ తెరకెక్కించిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవీ టాలెంటెడ్ డైరెక్టర్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా ప్రారంభంలో మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి. కానీ గత ఏడాది విడుదల చేసిన టీజర్ కారణంగా ఈ సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉంది.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయని ఊహిస్తే సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ విజువల్స్ మెగాస్టార్ సినిమాకి ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..?
టీజర్ కే ఇన్ని విమర్శలు వస్తే .మరి సినిమాలో కూడా ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటే మెగాస్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ వస్తుందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక బ్రహ్మ రాక్షసుడు భూమి మీద ఉండే చిన్న పిల్లలను, స్వర్గ లోకం లో ఉండే దేవకన్యలు ఎత్తుకొని పోతుంటాడట. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో, ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి తన పయనం సాగిస్తాడని..అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుందని సమాచారం..అలా ఆ స్వామి అనుగ్రహం తో చిన్నారి కోసం మెగాస్టార్ మూడు లోకాల ప్రయాణం ని కొనసాగిస్తాడట…
ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు తారసపడుతారు, మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుడి నుండి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుందట.అంతే కాకుండ ఆ దేవకన్య చిరంజీవి దేనికోసమైతే వెతుకున్నాడో ఆ గమ్య స్థానానికి చేరుకోవడానికి ఆమె సహాయ పడుతుంది.చివరికి ఆ బ్రహ్మరాక్షసుడుని చిరంజీవి ఎలా మట్టుబెట్టాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది..అద్భుతమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించాడని సమాచారం.. మరి గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో తెలియాల్సి వుంది..