దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కోసం యావత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు…ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా, ఇందుకోసం ఆయన తాజాగా లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ టీం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది.ఇందులో భాగంగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు మూవీ టీం వెళ్లింది.
RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!
కాగా ప్రస్తుతం ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయ్యింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య న్యూస్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా ఈ టీమ్ వెంట ఒడిశాకు చేరుకున్నాడు.దీంతో ఈ మూవీలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది..
పృథ్వి రాజ్ కారణంగా ఈ సినిమాకు మాలీవుడ్, దుబాయ్ కంట్రీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ బిగ్గెస్ట్ మూవీకి క్రేజ్ మరింత పెరిగింది… త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి కీలక విషయాలు తెలియజేయనున్నారు..