గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు…దీనితో ఈ సినిమాకు అన్ని భాషలలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో ఈ సినిమా ఓటిటిలోకి త్వరగా వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది..ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..?
తాజాగా హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం.. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజుతో పాటు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది.
హిందీలో 8 వారాల ఓటీటీ థియేట్రికల్ విండో డీల్ ఉండడంతో సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఓటిటి స్ట్రీమింగ్ జరగలేదు.మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమాని హిందీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..అయితే ఓటిటిలో సైతం గేమ్ ఛేంజర్ కి మిశ్రమ స్పందనే లభించింది.. మరి హిందీ స్ట్రీమింగ్ అయినా ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి..