MOVIE NEWS

ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..?

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. స్పై యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా దాదాపు ఎనభైకోట్ల భారీ బడ్జెట్‌తో  రూపొందింది.2023 ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్‌ మూవీ పై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిలైంది. ఏజెంట్ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు.మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు..

OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..?

ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు.కానీ అఖిల్ శ్రమకి ఫలితం దక్కలేదు.భారీ నష్టాలను మిగిల్చిన ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.అఖిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోనీలివ్ రెండు సార్లు అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కానీ లీగల్ ఇష్యూస్ కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది.

ఫైనల్ గా ఇప్పుడు అదే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ నెల 14 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందని కొత్త అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ సారి కూడా వస్తుందనే నమ్మకం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మూవీ రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. మరి ఇప్పటికైనా ఓటిటికి రిలీజ్ కు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి..

 

Related posts

ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..?

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

Leave a Comment