MOVIE NEWS

RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది..దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు .ఇందులో చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “RC16 “..పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలను పోషిస్తున్నారు..

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

అలాగే కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ శివన్న లుక్‌ టెస్ట్‌ని కూడా పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సర్ప్రెసింగ్ వీడియోతో తెలిపారు.దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు…ఈ సినిమా కథలో భాగంగా.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం…

ఈ షూటింగ్ కోసం మూవీ టీం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.అనుమతులు వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. అలాగే ఢిల్లీ లోని జమా మసీదు వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

 

Related posts

మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!!

murali

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

murali

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment