MOVIE NEWS

ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.. “ ఎన్టీఆర్ నీల్ “ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నాడు.

చరణ్ నటించిన ఆ సినిమాతో బాగా డిస్సపాయింట్ అయ్యా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్..!!

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.తర్వాత జరిగే షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కలకత్తా వెళ్లనుంది.. ఈ సినిమాలోని కీలక సీన్స్ ను అక్కడే షూట్ చేయనున్నారు. నిజానికి ఎన్టీఆర్ మార్చి నెలలో ఈ షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ సెట్స్ లో ఎన్టీఆర్‌ అడుగుపెట్టేందుకు ఇంకాస్త సమయం పట్టనుందట. ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నారని సమాచారం.

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రశాంత్‌నీల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.  ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్సి లో మొదటి సారి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు..

 

Related posts

ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..?

murali

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

murali

Leave a Comment