MOVIE NEWS

మరో అరుదైన ఘనత సాధించిన వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డు క్రియేట్ చేసింది.అలాగే సీనియర్ నటులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మామ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా పర్ఫెక్ట్ పండగ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టారు.. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన f2,f3 సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిపి సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడి మరో సారి సక్సెస్ అయ్యాడు..ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో రేర్ ఫీట్ సాధించింది. ఏకంగా 50 రోజుల థియేట్రీకల్ రన్ ఫినిష్ చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 సెంటర్స్ లో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుక చేసుకుంటుంది. అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీ లాభాలు తీసుకొచ్చింది.ఓటిటిలో సైతం ఈ సినిమా దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటిలో టాప్ ట్రెండింగ్ లో వుంది..వెంకటేష్ కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం మరో మైలు రాయిగా నిలిచింది..

 

Related posts

ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?

murali

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

murali

Leave a Comment