MOVIE NEWS

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలలో నటించిన “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా కూడా చోటు దక్కించు కుంది.. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఈ క్లాసిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు .

వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూనే వున్నారు… అయితే ఈ మూవీని మేకర్స్ మార్చి 7 న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పాత వీడియో ఒకటి ఫ్యాన్స్‌ని ఆశ్చర్య పరుస్తుంది.ఈ వీడియో లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలో కీలకమైన రేలంగి మామయ్య పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇంతటి కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్‌ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సూపర్ స్టార్ రజనికాంత్ అయితే బాగుంటుందని దిల్ రాజు తో చెప్పాను.

శంకర్ గారి రికమండేషన్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ నాకు దొరికింది. ఆయనను కలవడానికి నేను చెన్నై కూడా వెళ్లాను. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి నేను గుర్తుపట్టలేదు. ఆయన ఒక గంట టైం ఇచ్చారు కథ చెప్పాను ఆయనకు ఎంతగానో నచ్చింది. కానీ ఆ టైం లో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ గారు సినిమాకు నో చెప్పారు.. అని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Related posts

“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా…

filmybowl

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

Leave a Comment