MOVIE NEWS

వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు.

ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి భారీ లొకేషన్లలో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతున్నట్లు సమాచారం..రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు..ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..ఇదిలా ఉంటే వార్ 2 మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు..ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు..ఈ సాంగ్ లో వారిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలిపారు.క్లైమాక్స్ ఫైట్ కి ముందు వచ్చే ఈ పాట 500 మంది డాన్సర్స్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..ఈ సాంగ్ కి బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీ అందిస్తుండగా ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

 

Related posts

ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?

murali

హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..?

murali

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

Leave a Comment