న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది నాని నటించిన ‘హయ్ నాన్న’, “సరిపోదా శనివారం” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..సాధారణంగా నాని నటించే సినిమాలలోసరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందుకు నాని ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో హైప్ మాములుగా లేదు.
ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!
ఈ సినిమాలో నాని తన కెరీర్ లో ఎప్పుడు చేయని రా అండ్ రస్టిక్ పాత్రను చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.. మేకర్స్ ముందునుంచి చెబుతున్నట్లుగానే ఎవ్వరూ పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ పాత్రలో నాని నటిస్తున్నాడు..”రా ట్రుథ్ రా’ లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం చాలా కొత్తగా అనిపించింది..చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ సాగిన టీజర్ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది.
దసరా సినిమాతో నానికి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఈ సినిమాతో అంతకుమించి హిట్ ఇవ్వనున్నట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..టీజర్ అంతా ఒకెత్తు అయితే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. వేసవి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.