టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నేడు(మార్చి 1) జీ5 ఓటిటిలోకి వచ్చింది..అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో చిన్న ట్విస్ట్ ఏర్పడింది..
అదేమిటంటే..ఓటిటి వెర్షన్ లో ఈ సినిమా నిడివి పెరిగుతుందని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మేకర్స్ యాడ్ చేస్తారని అంతా భావించారు.. కానీ మూవీ రన్ టైం తగ్గింది..థియేటర్ లో 2 గంటల 24 నిముషాలు వున్న ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో 2 గంటల 16 నిముషాల నిడివితో స్ట్రీమ్ అయింది..కొత్త సీన్స్ యాడ్ చేస్తారు అనుకుంటే వున్న సీన్స్ కట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..