MOVIE NEWS

RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో తన తరువాత సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఉప్పెన వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!!

ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్ కుమార్‌ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి ఆయన రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అలాగే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌ రాంచరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెలలో రామ్‌ చరణ్‌ బర్త్‌డే ఉన్న విషయం తెల్సిందే. చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న సినిమా టీజర్‌ను లేదా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలని బుచ్చిబాబుకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

బుచ్చిబాబు సైతం అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. సినిమా టైటిల్‌ను ఇప్పటికే కన్ఫర్మ్‌ చేసినట్లు తెలుస్తుంది… త్వరలోనే టైటిల్‌ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం..ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..

 

Related posts

కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!!

murali

మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment