మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”. ఈ సినిమాను మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. పాన్ ఇండియా వైడ్ భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..మంచు విష్ణు కి పాన్ ఇండియా వైడ్ భారీగా మార్కెట్ లేకపోవడంతో మేకర్స్ ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి స్టార్స్ ని కీలక పాత్రలలో నటింపజేశారు.. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలలో నటించారు.. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తున్నాడు.. ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుండటంతో ఈ సినిమాపై ఊహించని క్రేజ్ వచ్చింది. అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా కనిపిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి..
మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేసారు..దేవుడంటే అస్సలు నమ్మకం లేని తిన్నడు (మంచు విష్ణు) అమ్మవారి విగ్రహాన్ని సైతం రాయిగా భావిస్తాడు. అడవి గూడెంలో నివసించే అతని జనాల పైకి శత్రువులు దాడి చేసినప్పుడు ఒక్కడే అడ్డుగా నిలబడి అందరిని తరిమి కొడతాడు. అయితే ఇంత నాస్తికుడు అయిన కలిగిన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, లయకారకుడు అయిన శివుడుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడనేది ఈ సినిమా కథ..
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈసారి సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం మేకర్స్ రివీల్ చేశారు.మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ ఋషి, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ఐశ్వర్య భాస్కరన్ తదితరులతో పాటు చివరి షాట్ లో ప్రభాస్ ముఖాన్ని చూపించిన తీరు ఎంతో హైలైట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..