గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ’గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్ అంతా తరువాత సినిమాపై పెట్టాడు.. రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, దివ్వేంద్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు…
SSMB : మహేష్ లేటెస్ట్ లుక్ చూసారా.. మాములుగా లేదుగా..!!
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘RC16’ షూటింగ్ స్టార్ట్ కాగా.. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘RC16’ చిత్రంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అని సమాచారం.. చరణ్ సినిమాలో కామియో రోల్ చేయమని మూవీ మేకర్స్ మెగాస్టార్ ని సంప్రదించగా.. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..
త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి..అయితే మెగాస్టార్, రాంచరణ్ గతంలో చేసిన ‘ఆచార్య’ ప్లాప్ కావడంతో ఈ సారి వారి కాంబో కి ఎలాంటి దిష్టి తగలకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..