MOVIE NEWS

ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయం సాధించాయి.ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు.కానీ ఇప్పుడు శంకర్ పరిస్థితి దారుణంగా మారింది.. తాజాగా ఆయన తెరకెక్కించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.. దీనితో శంకర్ ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.శంకర్ స్క్రీన్ ప్లే, పేలవమైన స్టోరీల పట్ల భారీ ట్రోల్స్ వచ్చాయి. అయితే శంకర్ ప్రస్తుతం  ఇండియన్ 3 పూర్తి చేసే పని లో వున్నారు.. ఈ సినిమా తరువాత శంకర్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ప్రశ్నగా మారింది..

బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్ల సమయంలో శంకర్ తన తదుపరి చిత్రం వేల్పూరి నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు. కానీ ఆ సినిమా ఎవరితో అన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు తన కొత్త మూవీ.. వేల్పూరి నవల ఆధారంగా స్టార్ హీరో అజిత్ తో వర్క్ చేయాలని శంకర్ అనుకుంటున్నట్లు సమాచారం..కానీ దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం అజిత్.. ఫారిన్ లో ఉన్న విషయం తెలిసిందే. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ కాంపిటీషన్ లో ఆయన పాల్గొంటున్నారు. దీంతో ఆయన ఇండియా వచ్చిన వెంటనే శంకర్ అజిత్ తో ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నట్లు సమాచారం…

అయితే శంకర్ కు అజిత్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.అజిత్ “పట్టుదల” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచారు. త్వరలో అజిత్ మరో బిగ్గెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించింది

Related posts

వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!!

murali

వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!!

murali

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment