MOVIE NEWS

బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలను చేసారు.. కానీ బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రం ఎప్పుడో అర్ధం కావట్లేదు.. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత బాలయ్య అప్పజెప్పాడు. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేయగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు..పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్ చేశారనే న్యూస్ కూడా బాగా వైరల్ అయింది…

మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!!

కానీ సడన్ గా ఈ బిగ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిపోయింది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తోడు ప్రశాంత్ వర్మకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ప్రశాంత్ వర్మ సినిమా కోసం ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా పూర్తి అయినట్టుగా టాక్ వినిపిస్తుంది… త్వరలోనే ఈ క్రేజీ కాంబో గురించి అధికారక ప్రకటన కూడా రానుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే చర్చ జోరుగా నడుస్తుంది… దీంతో ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిన నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు..

బాలయ్య వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉంటాయి..పబాలయ్య కూడా మోక్షుని పక్కా ప్లానింగ్‌తో లాంచ్ చేయాలని చూస్తున్నాడు. కానీ మొదటి సినిమాకే ఇలా అవుతుంది ఏంటి అంటూ నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే మోక్షు సినిమాపై బాలయ్య త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు..

 

Related posts

ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!

murali

సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”

murali

బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!!

murali

Leave a Comment