MOVIE NEWS

అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర “..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ మొదలయి చాలా కాలమే అయింది.. ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.. కానీ షూటింగ్ కాకపోవడం, విఎఫ్ఎక్స్ పై నెగటివ్ టాక్ రావడంతో మేకర్స్ మళ్ళీ రీ వర్క్ చేయడం మొదలు పెట్టారు..యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు…

దేవర : జపాన్ ప్రమోషన్స్ కు సిద్దమైన ఎన్టీఆర్.. పిక్ వైరల్..!!

ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించారు… ఈ సినిమా వేసవిలో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది..వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు… ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం అని ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని కూడా చిరంజీవి తెలిపారు…అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ విన్నాక కడుపుబ్బ నవ్వుకున్నాని చిరంజీవి అన్నారు.

గతంలో దర్శకుడు కోదండరామిరెడ్డి తో పనిచేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్ తో అలాంటి ఫీలింగే ఉంటుందని చిరు తెలిపారు..ఈ సినిమాంగా కచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని చిరు తెలిపారు. ఈ క్రేజీ మూవీని షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తారు.త్వరలోనే మిగిలిన వివరాలు మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు..

 

Related posts

ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!!

murali

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

filmybowl

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు మొదలయ్యేది అప్పుడే

filmybowl

Leave a Comment