న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..నేడు నాని పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ లో నాని వైల్డ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. టీజర్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాడు.. ఇదిలా ఉంటే నాని హీరోగా నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”..
RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!
తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..’దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ కొత్త సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది.ఈ సినిమాలో నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి
దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నాని ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుందని తెలుస్తుంది..నేడు నాని పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా నుండి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది.. ‘రా స్టేట్‌మెంట్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.