గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఫ్యాన్స్ బుచ్చిబాబు సినిమాపైనే భారీగా హోప్స్ పెట్టుకున్నారు.. బుచ్చిబాబు సన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ గా నడుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ జరుగగా.. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ఢిల్లీ లో జరగనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్లో రెజ్లింగ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
NTR-NEEL : భారీ స్థాయిలో సెకండ్ షెడ్యూల్.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..!!
ఆలాగే ఈ సినిమా టైటిల్ మరియు టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..బుచ్చిబాబు “RC16” సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు… స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తుంది..
ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్ అయింది..దీనితో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా వున్నారు…అలాగే RC16 లో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్,సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.