MOVIE NEWS

SSMB : భారీ ప్రెస్ మీట్ కి సిద్ధమవుతున్న రాజమౌళి..!!

సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది..SSMB అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవల సీక్రెట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన రాజమౌళి సైలెంట్ గా షూటింగ్ కూడా చేసేస్తున్నాడు..

తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో జరుగుతుంది.. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక ఇదే మొదటి షెడ్యూల్ అని సమాచారం.అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలో నటించే నటీనటులు, తన టీమ్ తో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించేబోయే క్యాస్టింగ్, అలాగే టెక్నికల్ టీంను పరిచయం చేస్తారు.. ఆ సమయంలోనే ఆ సినిమా ఏ జానర్ లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతుందనే విషయాలను రాజమౌళి తెలియజేస్తారు.

ఆర్ఆర్ఆర్ వరకు ఆ పద్ధతి ఫాలో అయిన రాజమౌళి మహేష్ మూవీ విషయంలో మాత్రం మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే భారీ ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎస్ఎంబీ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.ప్రెస్ మీట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానుందని సమాచారం.

 

Related posts

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!!

murali

Leave a Comment