టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజా సజ్జ ప్రస్తుతం హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు..ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. గత ఏడాది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ “హను-మాన్” సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సంచలన విజయం సాధించింది.. “హను-మాన్” సినిమాతో తేజా సజ్జ తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అది కూడా పాన్ ఇండియా రేంజ్ హిట్.. దీనితో తేజా సజ్జ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..
“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!
తాను తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తేజా సజ్జ తన తరువాత సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో చేస్తున్నాడు..కార్తీక్ ఘట్టమనేని తో తేజా సజ్జ మరో సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు.. “ మిరాయ్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు..ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..
ఇదిలా ఉంటే మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ సినిమా ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో తేజా సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది..