MOVIE NEWS

ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ హీరోగా మారాడు.. ఆ సినిమా సుహాస్ కెరీర్ ని మార్చేసింది.. సుహాస్ కెరీర్ లో ఊహించని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఆ సినిమా తరువాత వరుసగా విభిన్న పాత్రలలో నటించిన సుహాస్ వరుస సక్సెస్ లు అందుకున్నాడు.. సుహాస్ నటించిన రీసెంట్ మూవీ”జనక అయితే గనక “.. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.. సుహాస్ స్టోరీ సెలక్షన్ బాగుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!

హీరోగానే కాకుండా సుహాస్ విలన్ గా కూడా మెప్పించాడు.. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమాలో సుహాస్ సైకో విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు..ఇదిలా ఉంటే సుహాస్, మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… సుహాస్ తాజాగా నటిస్తున్న మూవీ ‘ఓ భామ అయ్యో రామ’..ఈ అందమైన ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది..ఇటీవల “జో” సినిమాతో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ యూత్ ఆడియన్స్ కి క్రష్ గా మారింది..

ఈ సినిమాను రామ్ గోధల తెరకెక్కిస్తున్నారు.. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం… సినిమాలో ఆయన గెస్ట్‌ రోల్‌ అందరిని సర్‌ఫ్రైజ్‌ చేస్తుందని మేకర్స్ తెలిపారు..దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ ఏర్పడింది..

 

Related posts

రౌడీ కేజీఎఫ్ అంట….

filmybowl

ఎస్ఎస్ఎంబి : బిజీఎం కోసం రంగంలోకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

మరోసారి ఆ వీడియో షేర్ చేస్తున్న నెటిజన్స్.. బన్నీ పరువు తీస్తున్నారుగా..!!

murali

Leave a Comment