MOVIE NEWS

ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. దర్శకుడు హనురాఘవపూడి ఈ సినిమాలో ప్రభాస్ ని సరికొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించలేదు. కాబట్టి ఈ పాత్ర ఫ్యాన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా క్లైమాక్స్ లో చనిపోతాడు అంటూ ఒక ట్విస్ట్ అయితే రివిల్ అయినట్టు సమాచారం.. క్లైమాక్స్ లో ప్రభాస్ ఎందుకు చనిపోతాడు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు హనురాఘవపూడి తన గత సినిమా సీతారామం లో కూడా హీరో పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది.. అయితే అలాంటి క్లైమాక్స్ పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అనేది ప్రశ్నగా మారింది..

ప్రభాస్ గతంలో చేసిన చక్రం సినిమాలో కూడా క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతుంది..కానీ ఆ సినిమా కథ బాగున్నా సినిమా మాత్రం ఆడలేదు.. దీనితో ఫ్యాన్స్ ఆ విషయంలో కంగారు పడుతున్నారు..ఫౌజీ సినిమా క్లైమాక్స్ లో కూడా హీరో పాకిస్తాన్ వాళ్లకి దొరికిపోతాడట.ఆ సమయంలో హీరో పాత్ర పాకిస్తాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతాడని సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫౌజీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.. మరి దర్శకుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి..

 

Related posts

ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

murali

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

Leave a Comment