MOVIE NEWS

సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ సృష్టించింది..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవిని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. అయితే ఓటీటీ కంటే ముందు ఈ చిత్రం టీవీలో టెలికాస్ట్ కానుంది. తాజాగా నేడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ జీ5  నేడు ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్‍కు తెస్తామనేలా హింట్ ఇచ్చింది. కానీ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం వెల్లడించలేదు.

అలాంటి పాత్రలకు మహేష్ దూరం.. మరి రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో..?

ఏవండోయ్ వాళ్ళు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచిచూడండి అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. స్ట్రీమింగ్ త్వరలో అంటూ అప్‍డేట్ ప్రకటించింది. ముగ్గు ఫొటోలను కూడా షేర్ చేసింది.. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇంత ఆలస్యమా ఇంకెప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ కన్నా టీవీ లో ముందు రిలీజ్ కాబోతుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సినిమా ప్రసారం కానుంది. జీ తెలుగు కూడా త్వరలో అంటూ ఊరిస్తోంది. టెలికాస్ట్ డేట్‍ను మాత్రం వెళ్లడించలేదు. టీవీలో ప్రసారమైన ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం..

 

Related posts

ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?

murali

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

murali

బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!

murali

Leave a Comment