టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ బ్యూటీ అయిన ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయలేదు..అలాంటిది ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు.రాజమౌళి క్రేజ్ తోనే ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లనుంది..అయితే మహేష్ ని దర్శకుడు రాజమౌళి ప్రభాస్ ని చూపించినంత స్ట్రాంగ్ గా చూపించగలడా అని ఫ్యాన్స్ లో డౌట్స్ క్రియేట్ అయ్యాయి..
లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!!
రాజమౌళి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కచ్చితంగా ఉంటాయి. ఆయన సినిమాలో హీరో ఒక యోధుడిగా కనిపిస్తాడు. భారీ కటౌట్ తో పెద్ద పెద్ద ఫైట్లను చేయగలిగే కెపాసిటీ ఉన్న హీరోగా కనిపిస్తాడు. తన గత సినిమాల స్టైల్ లోనే మహేష్ బాబు ని రాజమౌళి చూపిస్తున్నాడా లేదా ఈ సారి సరికొత్తగా ట్రై చేస్తున్నాడా అనేది తెలియాల్సి వుంది..మహేష్ బాబు ఒక యోధుడిలా కనిపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని…ఎందుకంటే మహేష్ చాలా సాఫ్ట్ గా ఎంతో సింపుల్ గా ఉంటాడు. ఒక ప్రిన్స్ లా చూపిస్తే మాత్రం ప్రేక్షకులకి నచ్చుతుంది.
అంతే కానీ భారీగా ఏలివేట్ చేస్తు యోధుడిలా మాత్రం మహేష్ బాబుని ఫ్యాన్స్ ఉహించుకోలేరు..కాబట్టి రాజమౌళి మహేష్ ఎలా డీల్ చేస్తున్నాడో తెలియాల్సి వుంది..ఈ సినిమాతో రాజమౌళి ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో హైయస్ట్ కలెక్షన్స్ సాధించిన దంగల్ మూవీ కలెక్షన్స్ బ్రేక్ చేయాలనీ చూస్తున్నాడు.. 3000 కోట్ల టార్గెట్ తో రాజమౌళి ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు