MOVIE NEWS

ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ రాజాసాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీ హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ మేకర్స్ ఫ్యాన్స్ ని ఇంకా వెయిటింగ్ లో పెడుతున్నారు.

NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

నిజానికి రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా ఆ టైం కు రిలీజ్ కావడం కష్టమని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు.దీనితో రాజా సాబ్ మేకర్స్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏప్రిల్ మిస్సైన రాజా సాబ్ ఇప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను సెప్టెంబర్ చివర్లో అంటే విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది…అయితే దసరాకి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కానుంది..

బాలయ్య సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.దీనితో రాజా సాబ్, అఖండ 2 ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంతా భావిస్తున్నారు. మరి ఆ సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి..

 

Related posts

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

murali

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment