MOVIE NEWS

ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు..ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 సినిమా రికార్డు సైతం క్రాస్ చేసి పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.. ఇండియన్ సినిమా చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది..ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ తరువాత చేయబోయే సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. అల్లుఅర్జున్ తన తరువాత సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

“వార్ 2” మూవీ టీం పై ఎన్టీఆర్ అసహనం.. కారణం అదేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఐకాన్ స్టార్ తన తరువాత సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు… ఇప్పటికే వీరి కాంబోలో మూడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కగా త్వరలో రాబోయే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గతంలోనే ప్రకటించినా సీన్ లోకి అట్లీ రావడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూషన్ మొదలైంది..ఐకాన్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు.. అట్లీ స్టోరీ కూడా నచ్చడంతో వీరి సినిమా త్వరలో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఏమైందో కానీ వీరి కాంబోలో సినిమా ఆగిపోయింది..

దర్శకుడు అట్లీ సల్మాన్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.. కానీ ఆ కాంబో కూడా సెట్ కాకపోవడంతో అట్లీ మళ్ళీ అల్లుఅర్జున్ ని కలిసినట్లు సమాచారం..దీనితో అల్లుఅర్జున్, అట్లీ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం..అట్లీ సినిమా తరువాత త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్, అట్లీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం..

 

Related posts

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

filmybowl

‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!

murali

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment