MOVIE NEWS

వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ మూవీ  ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!!

‘ది రాజా సాబ్’ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ముందుగా అనౌన్స్ చేశారు.కానీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ కష్టాలు మొదలయ్యాయని తెలుస్తుంది.., దానితో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడడం గ్యారెంటీ అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ‘ది రాజా సాబ్’ మూవీ వాయిదా పడడం ఖాయమని తెలుస్తుంది..

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదని సమాచారం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ ప్రభాస్ కి అంతగా నచ్చలేదట.. ‘ఆదిపురుష్’ మూవీ సమయంలో కూడా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ప్రభాస్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ తన సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. దీనితో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయం ఓ కొలిక్కి వచ్చాకే రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి..

Related posts

మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా

filmybowl

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

murali

Leave a Comment