పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు భారీ సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి.గతంలో తనకి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి భారీ హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.
SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ సీన్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు.
“పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించిన్నట్లు తెలుస్తుంది..