MOVIE NEWS

కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. పూరీజగన్నాథ్ తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో “మగధీర” అనే బిగ్గెస్ట్ మూవీలో నటించాడు..ఆ సినిమా సంచలన విజయం సాధించింది.. తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటిని తిరగరాసింది..రెండో సినిమాతోనే రాంచరణ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు.. చరణ్ కెరీర్ ని టర్న్ చేసిన మగధీర తరువాత చరణ్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే ఊపులో రాంచరణ్ నటించిన మూడో మూవీ “ ఆరంజ్ “..పక్కా మాస్ హీరోగా గుర్తింపు పొందాక చరణ్ ప్యూర్ లవ్ స్టోరీ చేయడంతో ఆ సినిమా అప్పటి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఆస్ట్రేలియా లో జరిగింది.హ్యారిస్ జైరాజ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. ఈ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయి అంటే ఇప్పటికి ఆ సాంగ్స్ కోసం యూత్ పడి చచ్చపోతారు..పాటలు అంత హిట్ అయినా సినిమా మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.. ఈ సినిమాతో నాగబాబుకు భారీగా నష్టం వచ్చింది..

హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అప్పటి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.. కానీ ఆరంజ్ సినిమాను ఇప్పటి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పటి తరం ప్రేక్షకులు ఈ సినిమా సాంగ్స్, కాన్సెప్ట్ కి ఎంతగానో కనెక్ట్ అయ్యారు… తాజాగా “ఆరెంజ్” చిత్రాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ యూత్ మనసు దోచేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఆరెంజ్ సినిమా మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేసింది. గతంలో థియేటర్లలో ఎలా సందడి చేసిందో, ఈసారి కూడా అభిమానులు, ప్రేమికులు అదే స్థాయిలో ఈ సినిమాను థియేటర్లలో ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. వసూళ్ల పరంగా కూడా “ఆరెంజ్” మంచి రికార్డులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది..

 

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!

murali

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment