MOVIE NEWS

హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి..గత ఏడాది ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే హోల్డ్ లో పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు “..స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ పెండిగ్ లో పడింది.. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమా షూటింగ్ కి ఎక్కువ రోజులు పడుతుంది. పైగా మేకర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.. ఎన్ని రోజులు గడిచిన షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు..

ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..?

ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..

రీసెంట్ గా ఈ సినిమా నుండి “మాట వినాలి” అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం విశేషం..నేడు ప్రేమికుల దినోత్సవం సందర్బంగా తాజాగా రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో అనే లిరిక్ తో వస్తోంది.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

Related posts

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

murali

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

murali

“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!!

murali

Leave a Comment