MOVIE NEWS

హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు మీద వున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ వున్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో నటిస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.. రీసెంట్ గా నాలుగో సినిమా కూడా మొదలైంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాకు “అఖండ 2 తాండవం” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 25 న దసరా కానుకగా అఖండ 2 ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే బాలయ్య మరో స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు “హరీష్ శంకర్”.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్ “ అనే సినిమా మొదలు పెట్టిన హరీష్ శంకర్.. ఆ సినిమా హోల్డ్ లో పడిపోవడంతో రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజతో “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేసాడు.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఏ స్టార్ హీరో హరీష్ ని పట్టించుకోవడం లేదు.. పవన్ తో మొదలెట్టిన “ ఉస్తాద్ భగత్ సింగ్ “ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి..

ఈ సమయంలో బాలయ్యకు హరీష్ శంకర్ కథ చెప్పగా బాలయ్యకు ఆ కథ నచ్చడంతో సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని సమాచారం. సాధారణంగా హరీష్ శంకర్ అంటే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దాని నుండి బయటకి రావడానికి హరీష్ శంకర్ ఈసారి కొత్త కథతో రాబోతున్నట్లు తెలుస్తుంది.. హరీష్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో బాలయ్యని మరింత కొత్తగా చూపిస్తాడో లేదో చూడాలి..

 

Related posts

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

murali

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

murali

Leave a Comment