MOVIE NEWS

ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD” సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.. గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” రాజాసాబ్ “ రిలీజ్ కు రెడీగా ఉంది.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో మరో భారీ సినిమా ఉంది.. అదే “ఫౌజీ“..

కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ స్పెషల్ అప్‌డేట్ అందించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ స్వయంగా షేర్ చేసారు. ”ఇండియన్‌ సినిమా పరిశ్రమకు బాహుబలి అయిన రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నా 544వ సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్‌” అని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చాడు.

1940ల నాటి అన్యాయాలకు మరియు మరచిపోయిన సత్యాలకు రక్తపాతమే ఒక సమాధానం అని నమ్మే ఓ యోధుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

Related posts

ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

filmybowl

మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

filmybowl

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment