MOVIE NEWS

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను నాని ఎంతగానో మెప్పిస్తుంటాడు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ నాని దూసుకుపోతున్నాడు.గత ఏడాది నాని నటించిన “ సరిపోదా శనివారం “ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..గతంలో వరుసగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేసిన నాని..ఆ తర్వాత మాస్ సినిమాలు కూడా చేస్తూ అదరగొడుతున్నాడు… సినిమా సినిమాకూ తన మార్కెట్ ని సైతం నాని విస్తరించుకుంటున్నాడు…

“కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!!

దసరా, హాయ్ నాన్న, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో నాని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం ‘హిట్-3’ లాంటి సూపర్ హిట్ ప్రాంఛైజ్ లో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తనకు ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ‘ప్యారడజ్’ అనే మూవీని నాని త్వరలో మొదలుపెట్టబోతున్నాడు..అయితే ఎంత మంది డైరెక్షన్ లో నటించినా స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించాలని నాని కోరిక..ఈ క్రమంలోనే నాని డ్రీమ్ డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాని హీరోగా బాగా సూటవుతాడు.. వీరి కలయికలో సినిమా వస్తే బాగుంటుందని ఇరువురి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.. కానీ ఎందుకో అది ఇంకా సాధ్యపడలేదు. అయితే ఎట్టకేలకు ఈ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ ప్రధాన పాత్రలో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు..నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతక్ం ఇరువురి కమిట్ మెంట్స్ పూర్తయ్యాక వీరి కాంబోలో సినిమా ఉండొచ్చని తెలుస్తుంది.

 

Related posts

AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

murali

Leave a Comment