MOVIE NEWS

సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో గత కొంత కాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే తన కెరీర్ ని టర్న్ చేసే సాలిడ్ హిట్ మాత్రం విశ్వక్ కి లభించలేదు.. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’ విడుదలకు సిద్ధం అయింది… రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించారు.విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది.

ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!!

విశ్వక్ సేన్ మొదటి సారి లేడీ గెటప్ లో అదరగొట్టాడు.ఈ సినిమాను వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషనల్ ఈవెంట్స్ జోరుగా నిర్వహిస్తుంది… ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి అయ్యాయి..తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.ఇందులో బోల్డ్ డైలాగ్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్ కారణంగా ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా మేకర్స్ ఫిక్స్ చేశారు..

క్రిస్పీ రన్‌టైమ్‌తో రానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సెన్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుతున్నాయి.ఇప్పటికే తన లుక్ తో సినిమాపై అంచానాలు పెంచేసిన ఈ యంగ్ హీరో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి..

 

Related posts

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

murali

ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!!

murali

దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment