MOVIE NEWS

ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’.. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.. ‘లైలా’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటి సారి లేడీ గెటప్ లో కనిపించాడు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే విశ్వక్ సేన్ గత సినిమాలను గమనిస్తే తన సినిమాలను ప్రేక్షకులకు చేరువయ్యేలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం తన అలవాటు.అలాగే తన సినిమా ఈవెంట్స్ కి స్టార్ హీరోస్ కచ్చితంగా వస్తారు.. అది కూడా మాక్సిమమ్ నందమూరి కాంపౌండ్ నుంచే రావడం జరుగుతుంది…

ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

విశ్వక్ సేన్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ చేసే హంగామా మాములుగా ఉండదు… అలాగే బాలయ్య అంటే విశ్వక్ కు ఎంతో అభిమానం.. బాలయ్య కూడా విశ్వక్ పై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు.. అయితే ఎప్పుడూ నందమూరి హీరోలతో తన సినిమాలను ప్రమోట్ చేయించుకునే విశ్వక్ తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా  మెగాస్టార్ చిరంజీవి ని ఇన్వైట్ చేసాడు..ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ సినీ నటుల ఫ్యాన్స్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలంతా ఒక్కటే.. ఒకరితో ఒకరు అంతా బాగానే వుంటారు..కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకరి ఫ్యాన్స్ పై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు అని చిరంజీవి అన్నారు.

బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా.. అని చిరంజీవి షూటిగా ప్రశ్నించారు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అని చిరంజీవి తెలిపారు.విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ కూడా అంటూ ఉంటాడు అని నాకు ఇక్కడికి వచ్చే ముందు కొన్ని మాటలు వినిపించాయి.. అలాంటి వారికీ నేనొకటే చెబుతా.. మనిషి అన్నాక వేరే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది.. అలాగే నా మీద ఆప్యాయత కూడా ఉంటుంది..అంతెందుకు మా అబ్బాయి రాంచరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం..నేను చరణ్ ఫంక్షన్స్ కి వెళ్లకుండా ఉంటానా ఇలాంటి ఫంక్షన్స్ కు వస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుందని మెగాస్టార్ అన్నారు..

 

Related posts

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

murali

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

మా దర్శకులందరిలో అసలైన ఓజి ఆయనే..రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment