MOVIE NEWS

దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను బ్రహ్మస్ట్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల గ్రాండ్ గా ప్రారంభించనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు..ఈ ఏడాది నవంబర్ లో దేవర 2 షూటింగ్ గ్రాండ్ గా మొదలు కానుందని సమాచారం.. ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు చేస్తున్నాడు.. ఈ సారి దేవర పార్ట్ 2 అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..అలాగే పార్ట్ 2 లో సరికొత్త పాత్రలు కూడా ఉండనున్నాయని తెలుస్తుంది..

 

Related posts

సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”

murali

war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!!

murali

కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..

murali

Leave a Comment