నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..బాలయ్య రేంజ్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా తరువాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మూవీ చేసేందుకు సిద్ధం అయ్యాడు.. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి.. దీనితో తాజాగా తెరకెక్కే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?
గతంలో వచ్చిన “ అఖండ “ సినిమా అద్భుత విజయం సాధించడంతో బాలయ్య తో చేసే నాలుగో సినిమాను దర్శకుడు బోయపాటి అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆ సినిమా కు ‘అఖండ 2-తాండవం’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
అయితే దర్శకుడు బోయపాటి తాను చేసే సినిమాల్లోని నటీనటుల ఎంపికపై చాలా క్లారిటీగా ఉంటాడు.తాజాగా ‘అఖండ 2’ కోసం కూడా పాత్రల ఎంపిక మొదలు పెట్టాడు.ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాకు బాలయ్య ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ సంయుక్త మేనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..