MOVIE NEWS

స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?

స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సినిమా అంటేనే ప్రేక్షకులలో గూస్ బంప్స్ వస్తాయి..అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు..తన సినిమాలో హీరోని సందీప్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంటుంది..అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో `స్పిరిట్‌` అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు…ఇప్పటి వరకు ప్రభాస్ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించునున్నాడు.. ప్రభాస్‌ పాత్రను సందీప్‌ రెడ్డి మరింత వైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

SSMB : టైటిల్ పై కసరత్తు ప్రారంభించిన జక్కన్న.. క్యాచీ టైటిల్ కోసం అన్వేషణ..!!

ప్రభాస్‌ లాంటి కటౌట్‌ సందీప్‌ రెడ్డికి దొరికితే, ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు… ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో రాబోతున్న `స్పిరిట్‌` చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీ ఇంకా ప్రారంభం కూడా కాలేదు.కానీ అంచనాలు భారీగా వున్నాయి…ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ వైరల్ అవుతుంది… స్పిరిట్ మూవీ కోసం సందీప్ ప్రభాస్‌ కి కండీషన్‌ పెట్టినట్లు సమాచారం.స్పిరిట్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్‌ చేయాల్సిన `ది రాజా సాబ్‌`, హను రాఘవపూడి మూవీ `ఫౌజీ`సినిమాలు షూటింగ్‌లు పూర్తి కావాల్సి వుంది..అవి పూర్తి అయిన తర్వాతనే `స్పిరిట్‌` ప్రారంభం కావాల్సి ఉంటుంది..

ప్రస్తుతం ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`, `ఫౌజీ` షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఏక కాలంలోనే రెండు షూటింగ్ బ్యాలెన్స్ చేస్తున్నాడు.. అయితే `స్పిరిట్‌` విషయంలో అలా చేయడానికి లేదని తెలుస్తుంది..సందీప్‌ రెడ్డి కచ్చితంగా తన సినిమా షూటింగ్‌లోనే పాల్గొనాలనే కండీషన్‌ పెట్టినట్లు సమాచారం.. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాక నెల పాటు ప్రభాస్‌ రెస్ట్ లో ఉంటారు. ఆ తర్వాత `స్పిరిట్‌` షూటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది..ఆ తర్వాత నుంచి కంటిన్యూగా తన మూవీకే పరిమితం కావాలని, మరే మూవీ షూటింగ్‌లోనూ పాల్గొనడానికి వీలు లేదని సందీప్‌ చెప్పినట్టు సమాచారం. ప్రభాస్ సైతం అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం..

 

Related posts

RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!!

murali

ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!

murali

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

filmybowl

Leave a Comment