టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి తో సినిమా చేయడం అది కూడా పాన్ వరల్డ్ మూవీ చేస్తుందటంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.. “SSMB “ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు సంబంధించి ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ షూటింగ్ కూడా సైలెంట్ గానే మొదలుపెట్టేసింది.ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..
అనిల్ రావిపూడి ఈ సారి సంక్రాంతికి వచ్చేది ఆ స్టార్ హీరోతోనేనా..?
ఇప్పటికే దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరి మీద ఒక కీలక సన్నివేశాన్ని ఐదు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రికరించినట్లు తెలుస్తుంది..తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు… ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన నానా పటేకర్ నటించనున్నట్లు సమాచారం.. మహేష్ తండ్రిగా ఆయన పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది… ఇప్పటికే ఆయనకు లుక్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగినట్లు సమాచారం..
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసేందుకు రాజమౌళి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది… గరుడ, మహారాజు అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ రెండు టైటిల్స్ కూడా అంతగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో మేకర్స్ సరికొత్త టైటిల్ కోసం అన్వేసిస్తున్నట్ట్లు సమాచారం..