MOVIE NEWS

అనిల్ రావిపూడి ఈ సారి సంక్రాంతికి వచ్చేది ఆ స్టార్ హీరోతోనేనా..?

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.. తన కెరీర్ లో ఇప్పటికే 8 సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..తాజాగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. సంక్రాంతి సీజన్ కావడంతో పోటీలో రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సైతం వున్నా వెంకటేష్ సినిమాకు ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు.ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వెంకటేష్ “మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం”అనే పేరుతో ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అనిల్ ప్రకటించారు.

RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!!

అయితే ఈసారి సంక్రాంతికి అనిల్ వచ్చేది వెంకటేష్ తో కాదని తెలుస్తోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..దీనితో ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే లేదా జూన్ నెలలో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.

వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు చూపించడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి అండ్ టీం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో వుంటాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది..

 

Related posts

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

గేమ్ ఛేంజర్ : ఫ్యాన్స్ కి న్యూ యర్ గిఫ్ట్.. ట్రైలర్ పై బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment