MOVIE NEWS

RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు.రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథతో వచ్చిన ఈ మూవీ దిల్ రాజుకి భారీగా నష్టాలు తీసుకొచ్చింది.రాంచరణ్ కెరీర్ లో “గేమ్ ఛేంజర్ “ మరో డిజాస్టర్ గా నిలిచింది..దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిశ్చయించుకున్న రాంచరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు..

స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!!

రాంచరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది.. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది.చిత్ర యూనిట్ నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. దర్శకుడు బుచ్చిబాబు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు భారీ సెట్‌లు వేయించాడు. రెండు రోజుల క్రితం చరణ్ తన కూతురు క్లింకారతో సెట్ కి వచ్చిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమా షూట్ ఓ క్రికెట్ గ్రౌండ్ లో షూటింగ్ జరుగుతుండగా ఫ్లడ్ లైట్, నైట్ షూటింగ్, క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగులతో ఈ సినిమా డీవోపీ రత్నవేలు ఎక్స్ వేదికగా కీలక ఫోటోలు షేర్ చేసాడు.రత్నవేలు ఈ సినిమాను స్పోర్ట్స్ నేపథ్యంలో రానుందని తెలిపాడు..షూటింగ్ శర వేగంగా జరుగుతుందటంతో ఈ ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Related posts

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

ప్రభాస్ “ఫౌజీ”లో మరో స్టార్ బ్యూటీ..కానీ అతిధి పాత్రేనా..?

murali

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

murali

Leave a Comment