MOVIE NEWS

స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా సరైన బ్రేక్ అయితే రాలేదు.. కానీ 2022 లో వచ్చిన డిజే టిల్లు సినిమా సిద్దూ కెరీర్ ని మార్చేసింది.. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.”టిల్లు గాడు డిజే కొడితే గిప్పా గిప్పా లాడాలా” అంటూ వచ్చే సాంగ్ టిల్లు సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో కూడా సిద్దూ పని చేసాడు.. ఛాన్నాళ్లకు డీజే టిల్లు తో సిద్దూకి సరైన బ్రేక్ వచ్చింది.. దీనితో ఆ సినిమాకు సీక్వెల్ కూడా చేసాడు.. “టిల్లు స్క్వేర్” అంటూ రిలీజ్ అయిన ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. టిల్లు గాడి ఆటిట్యూడ్, డైలాగ్స్, హీరోయిన్ అనుపమ గ్లామర్ సినిమాకు ప్లస్ గా మారాయి..

సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

డీజే టిల్లు,టిల్లు స్క్వేర్ సినిమాల హిట్స్ తో సిద్ధూ క్రేజ్ బాగా పెరిగింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. త్వరలో “జాక్” అనే సినిమాతో సిద్దూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది.బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా నేడు సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ జాక్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో.. సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకుల సన్నివేశాలు అలాగే హీరో పాత్రలో వున్న డిఫరెంట్ షేడ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించాయి. టీజర్ ని గమనిస్తే కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు తెలుస్తుంది..జాక్ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కూడా సిద్ధూ సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

 

Related posts

సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!

murali

నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!

murali

ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

murali

Leave a Comment