MOVIE NEWS

మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” విశ్వంభర “.. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఈ సారి ఎలాగైనా మాసీవ్ హిట్ కొట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు.. అందులో భాగంగా “విశ్వంభర” సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.. బింబిసారతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వశిష్ట విశ్వంభర తో మెగాస్టార్ కి సెన్సేషనల్ హిట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో విశ్వంభర సినిమాను నిర్మిస్తుంది.ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత గ్రాండ్‌గా ఉండబోతోంది.ఈ చిత్రాన్ని మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది.తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వశిష్టను మీడియా విశ్వంభర రిలీజ్ డేట్ గురించి అడగగా ఆయన స్పందిస్తూ, “త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది” అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో కూడా కష్టమే అని తెలుస్తుంది.2025 ఏడాది చివర్లోకి విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. హై వాల్యూస్, గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమా తెరకెక్కిస్తుండటమే రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఈ సినిమా కథ, కాన్సెప్ట్ చిరంజీవి క్రేజ్ కి తగ్గట్టు ఉంటుంది అని వశిష్ట తెలిపారు.. ఆయన మాట్లాడుతూ, “విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచే సినిమా అవుతుంది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా చెప్పగలను” అని అన్నారు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Related posts

ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!

murali

రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

murali

SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?

murali

Leave a Comment