పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది “ కల్కి “ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో భారీ హిట్ అందుకున్నాడు.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో “ రాజాసాబ్“ అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాజాసాబ్ త్వరలో రిలీజ్ కు సిద్దమైంది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ మూవీ “ ఫౌజీ “.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..
SSMB : మూడు పార్టులుగా మహేష్, రాజమౌళి మూవీ.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
బిగ్గెస్ట్ పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు..ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ “ ఇమాన్వి “ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాయిపల్లవిని మరో హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది..
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి కచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ప్రభాస్ ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉండటంతో ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు..