దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్. నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను బిగ్గెస్ట్ “ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి కానుండటంతో రెండో షెడ్యూల్ కెన్యాలో స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కెన్యా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మంగళవారం : బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్.. హీరోయిన్ విషయంలో బిగ్ ట్విస్ట్..!!
ఇప్పటికే అక్కడ షూటింగ్ లొకేషన్స్ కూడా రాజమౌళి ఫైనల్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.. అయితే ఆమె హీరోయిన్ రోల్ కాకుండా నెగటివ్ రోల్ చేస్తుందని సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ అయింది..దీనిపై ఇప్పటివరకు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. రాజమౌళి పెట్టిన పోస్ట్ కి ప్రియాంక చోప్రా ‘ఫైనల్లీ’ అంటూ రిప్లై ఇవ్వడంతో, కచ్చితంగా ఆమె సినిమాలో నటిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ లేకపోయినా…మూవీ యూనిట్ మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరును పరిశీలిస్తుందని సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో విషయం బయటకు వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి నాటికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది… అయితే ఈ కథ చాలా పెద్దదని, ఈ కథను పూర్తిగా ఒకే పార్ట్ లో రాజమౌళి చూపించడం కష్టం అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ కథను మూడు భాగాలుగా రాజమౌళి తీసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.మొదటి భాగం షూటింగ్ పూర్తికాగానే రెండో భాగం షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఫస్ట్ పార్ట్ ను త్వరగా రిలీజ్ చేసేసి, ఆ తర్వాత సెకండ్ పార్ట్ వైపు ఫోకస్ పెట్టాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం..