MOVIE NEWS

తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!!

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు..నాగ చైతన్య నటించిన ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ హైప్ రాలేదు.తండేల్ సినిమా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు మెండుగా వున్నాయి.,అలాగే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్,ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్మించారు.. ‘మగధీర’, ‘బద్రీనాథ్’ వంటి చిత్రాల తర్వాత అల్లుఅరవింద్ అంతటి రేంజ్ లో తీసిన సినిమా ఇదే.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కేవలం బుక్ మై షో నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఇలా ఉండగా దుబాయి లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే ప్రదర్శించారు.

అక్కడి బయ్యర్స్ తో పాటు పలువురు ముఖ్య ప్రముఖులు ఈ ప్రీమియర్ షోలో పాల్గొనడం జరిగింది… ఈ చిత్రాన్ని చూసాక వారు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ చందు మొండేటి హీరో హీరోయిన్ల మధ్య తీసిన లవ్ సీన్స్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఉందని, చాలా అద్భుతంగా తీసారని వారు చెప్పుకొచ్చారు.ఇక సెకండ్ హాఫ్ భావోద్వేగాలతో సాగుతుందని ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని రేంజ్ లో ఉందని తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని తెలిపారు..

 

Related posts

“ఓజి” మూవీకి సెకండ్ పార్ట్..పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!!

murali

‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!

murali

స్పిరిట్ : మూగవాడిగా ప్రభాస్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

Leave a Comment