When is Thandel releasing ?
MOVIE NEWS

నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “..ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం నాగ చైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమైన “తండేల్ “ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గతంలో వీరి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కాయి.. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!!

తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అంటూ కామెంట్లు చేశారు. అయితే నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించే ఈ కామెంట్స్ చేసారనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

 

Related posts

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

murali

మైత్రి- రామ్.. దర్శకుడు ఎవరంటే..

filmybowl

లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన.

filmybowl

Leave a Comment