రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపొతున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు..దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికి దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు..ఒక సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని ప్రేక్షకులు భావిస్తారు.. తాజాగా తను నాగ చైతన్య హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “తండేల్ “ సినిమాకు మ్యూజిక్ అందించాడు..ఈ సినిమాలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!!
ఇదిలా ఉంటే “తండేల్” రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా దేవిశ్రీ తన మ్యూజిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..దేవిశ్రీ మాట్లాడుతూ.. నాకు ఎప్పటి నుంచో కంప్లీట్ రిస్టిక్ ఫోక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ‘రంగస్థలం’ సినిమాతో తీరింది. అందులోని పాటలన్నీ జానపద మూలాల్లో నుంచి వచ్చినవే. నా సినిమాల్లో ఫోక్ టచ్ ఉన్న మరో సినిమా ‘ఉప్పెన’. అదొక విభిన్నమైన కంపోజిషన్ ని దేవిశ్రీ అన్నారు… ఇప్పుడు వస్తున్న ‘తండేల్’. కూడా ఫోక్ టచ్ ఉన్న సినిమానే అని దేవిశ్రీ తెలిపారు…
పాకిస్తాన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కథ ఇది. రియలిస్టిక్ అంశాలతో రాసుకున్న ఈ కథలో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. ప్రేక్షకులని హత్తుకునే భావోద్వేగాలున్నాయి…కథలో అంత విషయం ఉంది కాబట్టే.. అంతమంచి పాటలు వచ్చాయని దేవిశ్రీ అన్నారు.. ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా మరింత అద్భుతంగా ఉంటాయని దేవిశ్రీ తెలిపారు..